‎Gurram Paapi Reddy: గుర్రం పాపిరెడ్డి టీజర్ విడుదల.. ఒకే సినిమాలో తెలుగు స్టార్ కమెడియన్ తో పాటు తమిళ కమెడియన్!

‎Gurram Paapi Reddy: మురళీ మనోహర్ దర్శకత్వంలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా గుర్రం పాపిరెడ్డి. డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సడ్డి, అమర్ బురా, జయకాంత్ నిర్మాణంలో డార్క్ కామెడీ కథతో ఈ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, అలాగే తమిళ కమెడియన్ యోగిబాబు, జీవన్ పలువురు కీలక పాత్రల్లో నటించారు.

‎ఇది ఇలా ఉంటే తాజాగా గుర్రం పాపిరెడ్డి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే ఈ సినిమా టీజర్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. గుర్రం పాపిరెడ్డి నాకొక స్పెషల్ మూవీ. ఎందుకంటే యంగ్ స్టర్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు.

‎ఈ సినిమాలో జడ్జి పాత్రలో నటించాను. తమిళ సినీ పరిశ్రమలో యోగిబాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఇటీవల యోగిబాబు హీరోగా నటించిన ఒక కన్నడ సినిమాలో నేను నటించాను. ఆయన బయట చాలా కామ్ గా ఉంటారు. ఈయన కామెడీ చేస్తారని అనుకోము. కానీ కామెడీని పండించడంలో దిట్ట అని అన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా యోగి బాబు అలాగే బ్రహ్మానందం ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు.