Brahmanandam : ఈ బిగ్ స్టార్ సినిమాతో బ్రహ్మానందం మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ..ఎవరితో అంటే?

Brahmanandam : తెలుగు చలన చిత్ర పరిశ్రమ వద్ద హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కోసం తెలియని వారు ఎవరూ ఉండరు. ఎన్నో దశాబ్దాల పాటుగా తెలుగు వారిని నవ్విస్తూ వస్తున్న ఏకైక లెజెండ్ ఈయన. అయితే మరి తన కెరీర్ కి కూడా కొన్నాళ్ళు బ్రేక్ రావడంతో తెలుగు సినిమా దగ్గర తన హాస్యం మిస్సవ్వల్సి వచ్చింది.

తర్వాత మళ్ళీ తన ఆరోగ్యం బాగోలేక పలు ఇబ్బందులు వంటివి కాస్త బాధ కలిగించాయి. మరి ఇలా కొన్నాళ్ల పాటు బ్రహ్మానందం తెలుగు వెండితెరకు దూరం అయ్యారు. అయితే చాలా కాలం తర్వాత “జాతి రత్నాలు” లో కనిపించి ఉన్న కాసేపు అయినా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించారు.

మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ బిగ్ అప్డేట్ తెలుస్తుంది. బ్రహ్మానందం అసలు సిసలు గ్రాండ్ ఎంట్రీ ఓ బిగ్ స్టార్ తో ముందు ఉంది. అది కూడా ఎవరితోనో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ చిత్రం “భీమ్లా నాయక్” తో అట. ఈ చిత్రంలో బ్రహ్మానందం నటిస్తున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.

పవన్ మరియు బ్రహ్మానందం కాంబినేషన్ కామెడీ అంటేనే ఓ రేంజ్ లో ఉంటుంది. మళ్ళీ వీరు ఇన్నాళ్ళకి ఓ సినిమా చేస్తున్నారు. ఇక ఇదెలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే జనవరి 12 వరకు ఆగాల్సిందే.