రానా కార్ డ్రైవర్ గా మారిన బ్రహ్మాజీ

Brahmaji will be seen as Rana's driver

Brahmaji will be seen as Rana's driver

పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్లో రానా దగ్గుబాటి కూడ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన కోషి పాత్రను రానా చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది మల్టీస్టారర్ అనే అనాలి. ఇద్దరూ కథలో కథానాయకులే. ఒకరి పాత్ర ఎక్కువని, ఇంకొకరి పాత్ర తక్కువని చెప్పలేం. తెలుగులో కూడ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. పవన్ చేస్తున్నారు కదా అని రానా క్యారెక్టర్ తగ్గించే ప్రయత్నమేదీ చెయ్యట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జెన్యూన్ రీమేక్.

ఇకపోతే కథ ఆసాంతం రానా పాత్ర వెనుక అతని కార్ డ్రైవర్ పాత్ర కూడ ట్రావెల్ అవుతూ ఉంటుంది. నిత్యం ఆ పాత్ర వెంటే ఉంటూ నమ్మకంగా కనిపిస్తుంటుంది. మలయాళంలో ఆ పాత్రను చేసిన రమేష్ కొట్టాయం మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ పాత్రను తెలుగులో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ చేయనున్నారు. బ్రహ్మాజీ సహాయ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే ఈ రీమేక్ సినిమాలో మాత్రం ఆయన క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా ఉండనుంది. సినిమాలో ఇద్దరు హీరోలు ఎంతసేపు కనిపిస్తారో ఆయన కూడ అంతేసేపు కనిపిస్తారు. అతని పాత్రలో కూడ ఎమోషన్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కాబట్టి ఈ పాత్ర బ్రహ్మాజీ కెరీర్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ అవుతుందని చెప్పొచ్చు