రామ్ కోసం బాలయ్య ఇమేజ్ ని వాడుకోనున్న బోయపాటి శ్రీను..?

దేవదాసు సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ అవటంతో రామ్ కి వరస సినిమా ఆఫర్లు వచ్చాయి. రామ్ నటించిన రెడీ, మస్కా, పండగచేస్కో వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తర్వాత కొంతకాలం వరస ఫ్లాఫ్ లు అందుకున్న రామ్ .. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం రామ్ ది వారియర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.

ఇదిలాఉండగా ది వారియర్ సినిమా తర్వాత రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల అఖండ సినిమా ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ఈ సినిమాలో కూడా బాలయ్య ఇమేజ్ ని వడుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణకు వీరాభిమానిగా రామ్ నటించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా సక్సెస్ కి బాలయ్యతో పాటు ఆయన అభిమానులను కూడా బోయపాటి వాడుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణతో కలిసి ఎన్నో సినిమాలకు పని చేసిన బోయపాటి శ్రీను ఆయన మేనరింజలు బాగా పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య రెఫరెన్సులుండేలా భారీ సీన్‌ను ప్లాన్ చేసి అచ్చం బాలకృష్ణ లాగా తెరపై రామ్ కనిపించేలా ప్లాన్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలలో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా ప్రముఖ నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. నా సంస్థలు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న సినిమా ఇది. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళీ భాషలలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా ఇతర విషయాల గురించి తొందరలోనే వెల్లడిస్తామని ఆయన తెలియచేశారు.