వైరల్ వీడియో: ప్రాణాలకు తెగించి బామ్మను కాపాడిన మనవడు.. ఎద్దు దాడి చేస్తున్నా..!

Boy saves his grandmother from bull attack video goes viral

క్షణాల్లో చావును తప్పించుకున్నవాళ్లను చూసే ఉంటారు కదా. ఉదాహరణకు రోడ్డు యాక్సిడెంట్ల నుంచి ఇతర ప్రమాదాల నుంచి క్షణాల్లో తప్పించుకున్నవాళ్లు ఉంటారు. తప్పించుకుంటే బతుకుతారు.. లేదంటే ప్రాణాలు పోగొట్టుకోవడమే.

Boy saves his grandmother from bull attack video goes viral
Boy saves his grandmother from bull attack video goes viral

ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అటువంటిదే. ఓ ఎత్తు తన ప్రతాపాన్ని ఓ వృద్ధ మహిళ మీద చూపించింది. ఆ ముసలావిడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా… అక్కడే ఉన్న ఎద్దు.. ఆమెపై దాడి చేసింది. ఈడ్చిపారేసింది. దీంతో ఆ మహిళకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాపాడండి.. అంటూ అరవడంతో అక్కడే ఉన్న తన మనవడు… వచ్చి తనను కాపాడబోయే సరికి.. ఆ ఎద్దు.. ఆ పిల్లాడిపై కూడా తన ప్రతాపాన్ని చూపించింది. కొమ్ములతో నెట్టేస్తూ.. కాళ్లతో తన్నింది. అయినప్పటికీ.. ఆ పిల్లాడు పట్టువదలని విక్రమార్కుడిలా.. తన బామ్మను కాపాడే ప్రయత్నం చేశాడు. ఓవైపు ఎద్దు తనపై దాడి చేస్తున్నా పట్టించుకోలేదు. బామ్మను కాపాడటం కోసం తన ప్రాణాను సైతం లెక్కచేయలేదు. బామ్మను పట్టుకొని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆ ఎద్దు మరోసారి ఇద్దరిపై దాడి చేసింది.

ఇంతలో ఇరుగుపొరుగు అక్కడికొచ్చి ఆ ఎద్దును అక్కడి నుంచి తరిమేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎద్దు దాడిలో.. బామ్మ, మనవడితో పాటు మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఇక.. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డవడం, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు బామ్మను కాపాడిన మనవడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Watch: Boy saves grandmother from mad bull in Haryana

(Video Credits: ANI)