Boxoffice Report Of RRR Movie : బాక్సాఫీస్ రిపోర్ట్ : 12 రోజుల వసూళ్లతో చరిత్ర సృష్టించిన “RRR” చిత్రం.!

Boxoffice Report Of RRR Movie : టాలీవుడ్ మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ పీరియాడిక్ సినిమా ఇది.

దాదాపు నాలుగేళ్లు పాటు అభిమానులు ఎదురు చూడగా దీనికి బాక్సాఫీస్ బద్దలయ్యే సమాధానాన్ని దర్శకుడు అందించాడు. అయితే ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 ని ఇది క్రాస్ చెయ్యడం అసాధ్యం అని కన్ఫర్మ్ అయ్యిపోయింది కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇండస్ట్రీ హిట్ గా ఈ చిత్రం నిలిచింది.

ఇప్పుడు లేటెస్ట్ గా నిజాం వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ఈ సినిమా 12వ రోజుకి గాను 2.12 కోట్ల షేర్ ని రాబట్టగా దీనితో మొత్తం 12 రోజుల్లో ఈ చిత్రం 101.3 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టి చరిత్రలో నిలిచిపోయే భారీ మార్క్ ని నమోదు చేసింది. కేవలం ఒక్క రీజియన్ లో 100 కోట్లు కొల్లగొట్టడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు.

దీనితో నిర్మాత దిల్ రాజుకి ఇక్కడ భారీ లాభాలు వచ్చేసాయి. నిజాం లో తాను 70 కోట్ల మేర ఈ సినిమా హక్కులు కొనుకోగా ఇప్పుడు 30 కోట్లకి పైగా లాభాలు ఇంకా ఈ మార్క్ పెరుగుతూ వెళ్తుంది. అందుకే మొన్ననే దిల్ రాజు భారీ పార్టీని కూడా ఇచ్చేసాడు. సో ఫైనల్ గా ఈ సినిమా నిజాం లో ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో నిలిచిపోయింది.