Boxoffice Report : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప పార్ట్ 1” ఈ ఏడాది ఇంకో బిగ్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ హ్యాట్రిక్ బొమ్మ మొదటి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలిచింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా మొత్తం నాలుగు రోజులకి గాను మంచి వసూళ్లను అందుకున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మన దేశంలో ఐదు భాషలతో పాటుగా ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటి వరకు ఎంత వసూలు చేసింది అంటే. రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజులకి గాను 60 కోట్ల షేర్ ని రాబట్టగా తమిళనాడులో 5.75 కోట్లు, కర్ణాటకలో 7.86 కోట్లు అలాగే కేరళలో 2.8 కోట్ల షేర్ ని ఈ చిత్రం రాబట్టినట్టు తెలుస్తుంది. అలానే హిందీలో కూడా పుష్ప గట్టి వసూళ్లనే అందుకుంది హిందీలో మాత్రం ఈ సినిమా ఇప్పటి వరకు స్ట్రాంగ్ హోల్డ్ తో 8 కోట్ల మేర షేర్ ని రాబట్టినట్టుగా సినీ ట్రాకర్స్ చెబుతున్నారు.
అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమా నాలుగు రోజులకి గాను 8.5 కోట్లు షేర్ రాబట్టి టోటల్ గా నాలుగు రోజుల్లో దగ్గరదగ్గరగా 100 కోట్ల షేర్ దగ్గరకి ఈ చిత్రం వచ్చేసింది. అయితే ఇంకా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఎక్కువ టార్గెట్ నే ఛేజ్ చెయ్యాల్సి ఉంది మరి అది ఎప్పుడుకి క్లియర్ అవుతుందో చూడాలి.