Boxoffice Report : బాక్సాఫీస్ రిపోర్ట్ : బ్లాక్ బస్టర్ “అఖండ”కి నష్టాలు వచ్చిన ఏరియాలు ఇవే.!

Boxoffice Report : ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యిన సినిమాలు తక్కువే అయినా హిట్ రేట్ మాత్రం కాస్త ఎక్కువే అని చెప్పాలి. మరి ఈ ఏడాది భారీ హిట్స్ గా నిలిచిన చిత్రాల్లో టాలీవుడ్ ఎవర్ మాస్ హీరో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ” కూడా ఒకటి.

భారీ అంచనాలతో వచ్చి గల్లీ నుంచి అమెరికా వరకు బిగ్ హిట్ అయ్యింది. అయితే ఇంత పెద్ద హిట్ అయినా ఈ చిత్రం పలు చోట్ల నష్టాలనే మిగిలించింది అట. ఇది వినడానికి ఊహించని విధంగానే ఉన్నా నిజమేనట. అది కూడా ఏపీ లోనే ఈ నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న టికెట్ ధరల మూలాన ఈ నష్టం వాటిల్లినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఆ ఏరియాలు ఏమిటంటే అతి ఎక్కువ నష్టంతో గుంటూరు ఐదున్నర కోట్ల టార్గెట్ కోటి నష్టం రాగా తర్వాత కృష్ణ జిల్లాలో 3.7 కోట్ల టార్గెట్ తో దిగిన అఖండ 50 లక్షల నష్టం మిగిల్చింది. ఇక ఫైనల్ గా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సినిమా 6 కోట్ల టార్గెట్ తో దిగగా 5 లక్షల నష్టం మిగిల్చింది. దీని బట్టి ఇంత పెద్ద హిట్ టాక్ వచ్చినా అఖండ కొన్ని ప్రాంతాల్లో గట్టెక్కలేకపోయింది.

దీని బట్టి కొత్త టికెట్ రేట్స్ విధానం ద్వారా ఎలాంటి నష్టం కలుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా పూర్ణ, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే థమన్ సంగీతం అందించాడు.