Boxoffice Report Of Bangarraju : బాక్సాఫీస్ రిపోర్ట్ : మొదటి రోజు ఊహించని వసూళ్లు కొల్లగొట్టిన “బంగార్రాజు”.!

Boxoffice Report Of Bangarraju : ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యిన చిత్రాల్లో ఆడియెన్స్ లో మంచి బజ్ తో విడుదల కాబడిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “బంగార్రాజు” సినిమా మాత్రమే. మొదటి ఏవేవో భారీ సినిమాలు నడుమ బంగార్రాజు నలిగిపోతాడు అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ సంక్రాంతికి కాస్త కొద్దో గొప్ప చూడదగే సినిమాగా ఇదే నిలిచింది.

అక్కినేని నాగార్జున మరియు నాగ చైతన్య లు హీరోలుగా నటించిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ గట్టిగానే బిజినెస్ జరిపిందని ఇది వరకు చెప్పుకున్నాం. మరి ఆ బిజినెస్ కి తగ్గట్టుగా ఈ చిత్రం వసూళ్లు అందుకుందా అంటే ట్రేడ్ వర్గాలు అవుననే చెబుతున్నాయి. రెండు తెలుగు స్టేట్స్ లో బంగార్రాజు మొదటి రోజు వసూళ్లు అదరగొట్టేసాడు. ఏకంగా 8.32 కోట్ల షేర్ ని రాబట్టేసాడట.

ఇది పెద్దగా బజ్ లేదు అనుకుంటూనే వచ్చిన వసూళ్లు. అయితే ప్రాంతాల వారీగా బంగార్రాజు వసూళ్ల లెక్కలు చూసినట్టు అయితే. నైజాం – 1.7 కోట్లు, సీడెడ్ – 1.5 కోట్లు, వైజాగ్ – 1.2 కోట్లు, ఈస్ట్ గోదావరి – 91 లక్షలు, వెస్ట్ గోదావరి – 94 లక్షలు, కృష్ణ – 50 లక్షలు, గుంటూరు – 1.24 కోట్లు, నెల్లూరు – 36 లక్షలు ఈ చిత్రం అందుకుంది. అలాగే ట్రేడ్ వర్గాలు అయితే ఈ లెక్క మరింత పెరుగుతుందని కూడా చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించగా దక్ష నగర్కార్, ఫరియా అబ్దుల్లా లు స్పెషల్ సాంగ్స్ లో నటించారు. అలాగే అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.