KGF 2 And Beast : బాక్సాఫీస్ రిపోర్ట్ : హిందీలో ‘బీస్ట్’, ‘కేజీఎఫ్ 2’ రెండిటికీ ఫస్ట్ డే షాకింగ్ వసూళ్లు..!

KGF 2 And Beast :  లేటెస్ట్ గా ఈ వారం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరకి పాన్ ఇండియా లెవెల్లో కేవలం ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యిన భారీ సినిమాలు “బీస్ట్” మరియు “కేజీఎఫ్ చాప్టర్ 2” లు. అయితే ఈ సినిమాల్లో ఒకటి కన్నడ సినిమా కాగా మరొకటి తమిళ సినిమా అని తెలిసిందే. మరి అనుకున్నట్టు గానే కేజీఎఫ్ ధాటి ముందు బీస్ట్ నిలబడలేకపోయిందని ట్రేడ్ వర్గాల వారు కన్ఫర్మ్ చేసేసారు.
ముఖ్యంగా మొదటి రోజు అయితే ఈ రెండు సినిమాలకి ఊహించని వసూళ్లు హిందీలో నమోదు అయ్యినట్టుగా ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. మొదటగా కోలీవుడ్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమాకి చూసినట్టు అయితే ఈ సినిమా హిందీలో ఫస్ట్ డే కేవలం 50 లక్షలు మాత్రమే నెట్ వసూళ్లు కలెక్ట్ చెయ్యగా..
కేజీఎఫ్ కి మాత్రం ఊహించరు గాని అక్కడ ఆల్ టైం రికార్డు వసూళ్లు ఏకంగా 60 కోట్లు(జి ఎస్ టి) తో కలిపి కొల్లగొట్టింది అట. దీనితో బాలీవుడ్ సినిమాల రికార్డులు కూడా బద్దలయ్యాయినట్టు అయ్యింది.
ఇలా ఈ రెండు సినిమాలు నిజం గానే షాకింగ్ వసూళ్ళని మొదటి రోజు అందుకున్నాయి అని చెప్పాలి.
మరి బీస్ట్ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే కేజీఎఫ్ 2 ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.