బాక్సాఫీస్ రిపోర్ట్ : “సర్కారు వారి పాట” 3డేస్ వసూళ్ల వివరాలు.!

 Sarkaru Vaari Paata

 Sarkaru Vaari Paata : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం “సర్కారు వారి పాట” రిలీజ్ అయ్యి ఇప్పుడు మంచి రన్ ని థియేటర్స్ లో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం అదిరే వసూళ్లను అందుకుంటూ వెళ్తుండగా రోజు రోజుకి ఈ సినిమా వసూళ్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో మంచి నిలకడగా కొనసాగుతున్నాయని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

మరి లేటెస్ట్ గా అయితే మూడో రోజు ఏపీ మరియు తెలంగాణ అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. మొదటగా మూడో రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లు చూస్తే 13.01 కోట్ల షేర్ ని రాబట్టిందట. దీనితో మూడు రోజులకి గాను ఈ చిత్రం ఏపీ తెలంగాణాలో 61 కోట్లకి పైగా షేర్ ని రాబట్టేసిందట.

ఇక అలాగే యూఎస్ లో ఐతే ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్స్ తో అలాగే ఈరోజు ఆదివారం వసూళ్లతో అయితే 2 మిలియన్ మార్క్ కి చేరిపోయినట్టే అని చెబుతున్నారు. మొత్తానికి అయితే ఈ చిత్రం ఈ మూడు రోజుల్లో అయితే 70 కోట్లకి పైగా షేర్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. నదియా, సుబ్బరాజు మరియు సముద్రఖని లు కీలక పాత్రల్లో నటించారు.