Box Office Report : బాక్సాఫీస్ రిపోర్ట్ : ఇప్పటివరకు “పుష్ప” హిందీ కలెక్షన్ లెక్కలు..!

Box Office Report : టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ మరియు ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ చెప్పిన విధంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కాస్తా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చివేసిన లేటెస్ట్ చిత్రం “పుష్ప పార్ట్ 1”. అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన ఈ సినిమా లాస్ట్ మినిట్ లో రోజుకి 18 గంటలకి పైగా వర్క్ తో కొన్ని వాయిదాలతో వచ్చి మరీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ముఖ్యంగా ఈ సినిమాకి తెలుగు సహా హిందీ మార్కెట్ లో వచ్చిన ఆదరణ అయితే ట్రేడ్ వర్గాలకి షాక్ ఇచ్చింది. అలాగే హిందీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే భారీ వసూళ్లు అందుకుని సత్తా చాటింది. మరి ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి. మొత్తం నాలుగు వారాలకి గాను ఈ చిత్రం హిందీ ఏకంగా 85 కోట్ల మార్క్ ని టచ్ చేసిందట.

మొదటి వారం – 27.6 కోట్లు, రెండో వారం – 21 కోట్లు, మూడవ వారం – 25 కోట్లు అలాగే ఈ చివరి నాలగవ వారానికి గాను 11.3 కోట్లు ఈ చిత్రం అందుకుంది. దీనితో ఒక్క హిందీలోనే పుష్ప 85 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ని రీచ్ అయ్యి భారీ హిట్ గా నిలిచింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్ల గ్రాస్ కి చేరువలో ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా ఫహద్ ఫాజిల్ మరియు అనసూయ సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.