Box Office Report : బాక్సాఫీస్ రిపోర్ట్ : “కేజీఎఫ్” రికార్డులు బద్దలు కొట్టేసిన “పుష్ప”..కేవలం 13 రోజుల్లోనే!

Box Office Report : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప పార్ట్ 1 మొదటి రోజు నుంచే మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత తర్వాత మాత్రం సాలిడ్ రన్ ని కనబరిచింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర లాస్ట్ రెండు వారాలు మంచు రన్ కనబరిచింది.

మరి ఇదిలా ఉండగా ఈ దక్షిణాది భాషలు కాకుండా ఈ సినిమా హిందీ లో అదరగొట్టింది అని చెప్పాల్సిందే. మన దగ్గర అయినా ఒకటి రెండు రోజులు సినిమా డ్రాప్ అయ్యింది కానీ హిందీలో మాత్రం లాస్ట్ రెండు వారాలు రోజుకి మూడు కోట్లు తగ్గకుండా వసూళ్లు అందుకొని బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచింది.

ఇక మూడో వారానికి వచ్చినా పెద్ద డ్రాప్ అక్కడ కనిపించలేదు. మినిమమ్ రెండున్నర కోట్లు వసూలు చేస్తూ అక్కడ మరో భారీ హిట్ సినిమా అయినటువంటి “కేజీఎఫ్ చాప్టర్ 1” లైఫ్ టైం వసూళ్లను బద్దలు కొట్టేసినట్టు బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ 13 రోజులకి గాను పుష్ప హిందీలో 45.5 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. ఇది నిజంగా మామూలు విషయం మాత్రం కాదు. అల్లు అర్జున్ ని కేవలం హిందీ వరకు యూట్యూబ్ స్టార్ అని అనేవారికి పుష్ప ఒక చెంపపెట్టు.