Dj Tillu : బాక్సాఫీస్ రిపోర్ట్ : ట్రేడ్ వర్గాలకి షాకిచ్చేలా యంగ్ హీరో సినిమా వసూళ్లు.!

Dj Tillu : నిజంగా మన టాలీవుడ్ లో ఏ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుంది? ఆడియెన్స్ ఏ సినిమాకి ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెడతారు అనేవి ఒకింత ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. మరి అలాంటి చిత్రాల్లో లేటెస్ట్ గా వచ్చిన ఓ చిన్న సినిమా కూడా చేరింది అని చెప్పాలి. అదే “డీజే టిల్లు” చిత్రం.

దర్శకుడు విమల్ కృష్ణ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ తో తీసిన ఈ సినిమాని ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అయితే ఈ సినిమాకి ట్రైలర్ వచ్చాక ఇంకో లెవెల్ కి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మంచి ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంటుంది అని అంతా అనుకున్నారు.

కానీ ఈ రేంజ్ వసూళ్లు అయితే అందుకుంటుంది అని ఊహించి ఉండరు. వసూళ్ల పరంగా కీలక ఏరియా అయినటువంటి నైజాం లో ఈ చిత్రం కేవలం ఒక్కటంటే ఒకటే రోజులో 1.63 కోట్లు షేర్ అందుకొని ఈ ఏడాది ఒక్క రోజులో ఈ మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. దీనితో ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి.

అలాగే సిద్దూ కెరీర్ లోనే ఇది ఫస్ట్ టైం కావడంతో మున్ముందు అతని సినిమా మరింత డెవలప్ అవుతాయని అంటున్నారు. మొత్తానికి అయితే తన ఫస్ట్ డే కలెక్షన్ తో బాక్సాఫీస్ దగ్గర డీజే టిల్లు అదరగొట్టాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు.