Bheemla Nayak : టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గరకు చాలా కాలం తర్వాత రిలీజ్ అయ్యిన ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ మరియు భారీ చిత్రం “భీమ్లా నాయక్”. గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా అదరగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు అన్ని చోట్లా భారీ వసూళ్లను అందుకుంటూ వెల్తుంది.
మరి ఇదిలా ఉండగా మొదట రోజు పవన్ స్టార్డం కి తగ్గ సాలిడ్ వసూళ్లను అందుకున్న ఈ చిత్రం రెండు రోజులు ప్రపంచ స్థాయి వసూళ్లు వివరాలు తెలుస్తున్నాయి. మరి ఈ చిత్రానికి గాను రెండు రోజులు వసూళ్లు చూస్తే.. నైజాం లో 2 రోజులకి గాను 19.3 కోట్ల షేర్ రాగా సీడెడ్ లో భీమ్లా రెండు రోజులకి 5.30 కోట్లు, ఉత్తరాంధ్ర 3.4 కోట్ల షేర్ ని అందుకుంది.
అలాగే మిగతా ఈస్ట్, వెస్ట్ గుంటూరు తదితర ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రం దాదాపు 12 కోట్లు షేర్ వసూలు చేసిందట. అంటే ఒక్క ఏపీ మరియు తెలంగాణలో భీమ్లా నాయక్ రెండు రోజులకి గాను 40 కోట్ల రూపాయల షేర్ ని అందుకుంది. ఇక వీటితో పాటుగా యూఎస్ఏ లో దాదాపు ఈ రెండు రోజుల్లో 1.8 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.
మరి ఇది కూడా కలిపితే ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ 53 కోట్ల 51 లక్షలు వసూలు చేసేసింది. అలాగే ఇంకా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ నుంచి కూడా వసూళ్ల లెక్కలు తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికి అయితే ఈ రెండు రోజుల్లో భీమ్లా నాయక్ బిజినెస్ లో సగం రాబట్టేసాడు. మరి మిగతా సగం ఎప్పటికి కంప్లీట్ అవుతుందో చూడాలి.