Bangarraju : అక్కినేని వారి కుటుంబం నుంచి రిలీజ్ వచ్చిన లేటెస్ట్ మరో మల్టీ స్టారర్ సినిమా “బంగార్రాజు” కోసం అందరికీ తెలిసిందే. అక్కినేని నాగార్జున మరియు అక్కినేని చైతన్య లు హీరోలుగా రమ్య కృష్ణ మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది.
అయితే పండుగతో రిలీజ్ కాగా సాలీడ్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కాయి. అయితే ఈ ఓపెనింగ్స్ చూసి బంగార్రాజు సింపుల్ గానే తన టార్గెట్ ని కొట్టేస్తాడు అనుకున్నారు కానీ సోమవారం తర్వాత నుంచి బంగార్రాజుకి కష్టాలు తప్పలేదు. ఇంకా నైజాం లో అయితే దాదాపు నాలుగు కోట్లు నష్టాలే మిగులుస్తుంది అని ట్రేడ్ వర్గాలు కూడా చెప్పాయి.
మరి వీటితో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం నిన్నటి వరకు ఎంత వసూళ్లు రాబట్టిందో తెలుస్తుంది. అయితే ఓ పక్క భారీ ఫిగర్స్ ఈ సినెమాపియా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నా అవన్నీ ఫేక్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరి అసలు వసూళ్లు ఎంత వచ్చాయి అంటే 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందట. అయితే ఒక్క నైజాం లో మినహా బంగార్రాజు ఆల్ మోస్ట్ సేఫ్ అయ్యినట్టే అని తెలుస్తుంది. ఈ సినిమాకి వీకెండ్స్ బాగా వర్క్ అయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
అందుకే ఆల్ మోస్ట్ ఈ చిత్రం రికవర్ అయ్యినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. అలాగే దీనికి కూడా సీక్వెల్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.