KGF Chapter 2 : బాక్సాఫీస్ రిపోర్ట్ : వరల్డ్ వైడ్ “కేజీఎఫ్ 2” ఫస్ట్ డే భారీ వసూళ్ళ డీటెయిల్స్ ఇవే.!

KGF Chapter 2 :  చాలా కాలంగా ఎదురు చూస్తున్న పలు బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో కన్నడ ఇండస్ట్రీ రాకింగ్ స్టార్ యష్ బాస్ హీరోగా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఏక్షన్ డ్రామా సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి.
అయితే ఈ సినిమా రిలీజ్ ముందే దీని తాలూకా విజయాన్ని అంతా ఊహించారు. బహుశా బాహుబలి 2 రికార్డులు కూడా ఇది క్రాస్ చేస్తుంది అని ఆ అవకాశం లేకపోలేదని ట్రేడ్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరి ఈ అన్ని అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా మొదటి రికార్డ్ వసూళ్లనే ఇండియాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కొల్లగొట్టేసింది.ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అయితే హిందీ సినిమాలను సైతం దాటి సెన్సేషన్ ని నమోదు చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్త మొదటి రోజు వసూళ్ళ వివరాలు తెలుస్తున్నాయి.
మరి దీని ప్రకారం చూసినట్టు అయితే ఈ సినిమా కన్నడ బాక్సాఫీస్ వద్ద 30 కోట్లకి పైగా గ్రాస్ ని వసూలు చెయ్యగా ఇది ఆల్ టైం రికార్డ్ అయ్యింది.
ఇక అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణా లో చూసినట్టు అయితే ఇక్కడ కూడా గట్టి వసూళ్లనే ఈ సినిమా రాబట్టింది. ఇక్కడ కేజీయఫ్ లైఫ్ టైం వసూళ్లని మొదటి రోజే 25 కోట్లకు పైగా గ్రాస్ తో క్రాస్ చేసి డబ్బింగ్ సినిమాల్లో టాప్ ప్లేస్ లిప్ నిలిచింది.
మరి మలయాళ ఇండస్ట్రీలో కూడా 7.1 కోటి తో ఆల్ టైం రికార్డ్ నమోదు చేయగా తమిళ్ లోని బీస్ట్ లాంటి సినిమా ఉన్నా తమిళ జనం పట్టం కట్టారు.
అక్కడ కూడా ఈ సినిమాకి 7.5 కోట్ల మేర ఓపెనింగ్స్ అందించారు. ఇక అలాగే హిందీలో జి ఎస్ టి కాకుండా అయితే సుమారు 54 కోట్లకి పైగా వసూళ్లు అలాగే ఓవర్సీస్ లో ఓవరాల్ గా 25 కోట్లు రాబట్టినట్టు తెలిసింది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 160 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టినట్టు కన్ఫర్మ్ అయ్యింది. మొత్తానికి అయితే ఈ అధ్యాయం మొదటి రోజు ఇలా స్టార్ట్ అయ్యింది.
ఇక ఇది ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే..