Box Office Report KGF 2 : బాక్సాఫీస్ రిపోర్ట్ : 2 రోజుల “కేజీయఫ్ 2” వసూళ్ల సునామి..వరల్డ్ వైడ్ ఎంతంటే.!

Box Office Report KGF 2 :ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో రికార్డు వసూళ్లతో దుమ్ము లేపుతున్న మరో భారీ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2”.
ఎన్నో రోజులు నుంచి అభిమానులు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల అయ్యి ఇండియాలో రికార్డు స్థాయి వసూళ్లను అందుకొని ఆశ్చర్య పరుస్తుంది.
అంతే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ డబ్బింగ్ సినిమాకి కూడా రాని స్థాయి భారీ వసూళ్ళని ఈ సినిమా అందుకుంటూ దంచి కొడుతుంది.
అయితే ఇప్పుడు ఈ సినిమా వసూళ్ల సునామి ఏ రేంజ్ లో ఉంది అంటే జస్ట్ ఈ రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 300 కోట్ల క్లబ్ లో చేరిపోయిందట.
ఇది ఒక ఫాస్టెస్ట్ 300 కోట్ల రికార్డు అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక ఏరియాల వారీగా చూస్తే హిందీలో ఈ సినిమా రెండో రోజుకి గాను దగ్గరదగ్గర 47 కోట్లు రాబట్టి కేవలం హిందీ వెర్షన్ లోనే రెండు రోజులకి 100 కోట్ల మార్క్ ని సాధించి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.
ఇక కేరళ బాక్సాఫీస్ దగ్గర చూసినట్టు అయితే రెండు రోజులకి గాను 7.65 కోట్లు రాబట్టగా 13.4 కోట్ల గ్రాస్ ని అందుకుందట. ఇక కన్నడలో రెండు రోజులకి గాను 55 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టగా 32.7 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రెండు రోజులకి కలిపి సుమారు కన్నడతో సమానంగానే వచ్చేసాయి.
ఇక్కడ 51.8 కోట్ల గ్రాస్ అందుకోగా షేర్ కన్నడకి సమానంగా 32.2 కోట్ల షేర్ ని రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక ఫైనల్ గా ఓవర్సీస్ మార్కెట్ లో 45.5 కోట్లు గ్రాస్ ని అందుకుంది.
దీనితో రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకి పైగా గ్రాస్ ని 157 కోట్లకి పైగా షేర్ ని రెండు రోజుల్లో కేజీఎఫ్ 2 రాబట్టింది.