బాక్సాఫీస్ రిపోర్ట్ : భారీ వసూళ్లతో “కేజీఎఫ్ 2″…!

Box Office Report KGF 2

Box Office Report KGF 2 :  ఈ ఏడాదికి క్వార్టర్ 2022 లో రిలీజ్ అయ్యిన భారీ చిత్రాల్లో కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి వారికి కూడా ఒక గొప్ప సినిమా చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాని అందించినందుకు కన్నడిగులు దర్శకుడు ప్రశాంత్ నీల్ కి రుణపడి ఉండిపోయారు. అక్కడి స్టార్ హీరో యష్ బాస్ తో చేసిన ఈ సినిమా మొదటి భాగం భారీ హిట్ కావడంతో చాప్టర్ 2 పై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

మరి వాటికి తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 వేలకి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి రికార్డు ఓపెనింగ్స్ ని ఈ సినిమా అందుకుంది. అయితే అప్పటికే వచ్చిన RRR వసూళ్ళని క్రాస్ చెయ్యలేదు కానీ ఒక్క చోట మాత్రం RRR ని కూడా డబుల్ మార్జిన్ లో కొట్టింది. ఆ ఏరియానే నార్త్ బెల్ట్.

అక్కడ అయితే ఏకంగా బాహుబలి 2ని మించే రికార్డు ఓపెనింగ్స్ ఈ సినిమా అందుకొని ట్రేడ్ వర్గాలని షాక్ కి గురి చేసింది. ఇక ఇదిలా ఉండగా మొదటి రెండు వారాల లోపే 300 కోట్లు అందుకున్న ఈ సినిమా ఇపుడు ఎక్కడ ఏకంగా 350 కోట్లకి దగ్గరలోకి వచ్చేసింది.

ఈ వారం వసూళ్లను చూస్తే సోమవారం 8.28 కోట్లు, మంగళ – 7.48 కోట్లు అలాగే బుధ, గురు చేరింది. వారాల్లో కలిపి 12 కోట్లు వసూలు చేసింది. దీనితో ఈ చిత్రం ఇప్పటి వరకు 348.8 కోట్లకి దీనితో మరో రికార్డు మార్క్ 350 కోట్ల మార్క్ కి వచ్చేసింది. ఈ లెక్కన ఈ బిగ్ ప్రాజెక్ట్ హిందీలో మాత్రం సూపర్ స్ట్రాంగ్ గా నిలబడింది అని చెప్పాలి.