శ్రీముఖికి సర్ ప్రైజ్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.. ఏం జరిగిందంటే?

బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. ఎన్నో టీవీ షోలకు యాంకరింగ్ చేసిన శ్రీముఖి తన యాంకరింగ్ తో , కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి పటాస్, సూపర్ సింగర్స్, సరిగమప వంటి పలు టీవి షోస్ కి యాంకర్ గా వ్యవరించింది. శ్రీముఖి యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలో చెల్లెలి పాత్ర పోషించిన శ్రీముఖి నేను శైలజ , మాస్ట్రో, క్రేజీ అంకుల్స్ వంటి సినిమాలలో నటించింది. ప్రస్తుతం శ్రీముఖి చిరంజీవి హీరగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడ నటిస్తుంది.

ఒకవైపు టీవీ షోస్ మరొకవైపు సినిమాలతో ఎల్లప్పుడూ బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తన అందమైన ఫొటోస్, కామెడీ వీడియోస్, పర్సనల్ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటు ఉంటుంది. శ్రీముఖి మే 10 వ తారీఖున తన 29వ పుట్టిన రోజును స్నేహితులు బంధుమిత్రులతో కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంది. తన పుట్టిన రోజుకి సంబంధించిన ఫోటోలు కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది అభిమానులు సెలబ్రిటీలు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ క్రమంలో శ్రీముఖి ఎప్పుడు ఊహించని విధంగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సర్ప్రైజ్ చేశాడు. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియో చేసి ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తు సర్ప్రైజ్ చేసాడు. ఆ వీడియో ఇన్స్టాగ్రామ్ ద్వారా శ్రీముఖి షేర్ చేస్తూ” ఓ మై గాడ్..ఇది నా రోజు. రణ్‌వీర్ సింగ్ ఐలవ్యూ” అంటూ పోస్ట్ చేసింది.