బాలీవుడ్ సినిమా పరిశ్రమ లాక్ డౌన్ మూలంగా గట్టిగా దెబ్బతింది. లాక్ డౌన్ ఆనంతరం అన్ని భాషల పరిశ్రమలు మెల్లగా కొలుకుంటున్నాయి. కానీ హిందీ ఇండస్ట్రీ మాత్రం కష్టాలోనే ఉంది. ముంబైలో కోవిడ్ భయం ఇంకా పోలేదు. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది కూడ. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి జంకుతున్నారు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలను చూడటానికి థియేటర్లలోకి వచ్చే రిస్క్ చెయ్యట్లేదు అక్కడి ప్రేక్షకులు. అందుకే విడుదలైన రెండు మూడు సినిమాలు పరాజయం చెందాయి.
దీన్ని గమనించిన బాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా పెద్ద సినిమా వస్తే తప్ప ప్రేక్షకులను ఫుల్ చేయడం కష్టమని డిసైడ్ అయిపోయారు. ఆ సినిమా మామూలు పెద్ద సినిమా కాదని, పాన్ ఇండియా సినిమా అయ్యుండాలని అనుకుంటున్నారు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ మీద గురిపెట్టారు. త్వరలో రిలీజ్ కానున్న పాన్ ఇండియా సినిమా, అన్ని భాషలు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో చూస్తున్న సినిమా ఇదే. రాజమౌళి దర్శకత్వం కావడమే ఇందుకు కారణం. కాబట్టే అక్కడి నిర్మాతలు కొందరు ‘ఆర్ఆర్ఆర్’ హక్కుల్ని దక్కించుకోవాలని తీవ్రంగా ట్రై చేస్తున్నారు. పోటీపడి హిందీ హక్కుల కోసం భారీ మొత్తం కోట్ చేస్తున్నారు.