Black ticket mafia : బ్లాక్ టికెట్ మాఫియా..”భీమ్లా” 40 టికెట్ ఎంతకి అమ్ముతున్నారో తెలుసా?

Black ticket mafia : ఊహించని విధంగా ఏపీలో కొత్త టికెట్ ధరలు వస్తాయి అనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా “భీమ్లా నాయక్” రిలీజ్ అయ్యేవరకు రాలేదు. దీనితో ఇది మళ్ళీ కావాలనే ప్లాన్ చేసారని అప్పుడు వకీల్ సాబ్ కి మొదలు పెట్టి ఇప్పుడు భీమ్లా నాయక్ కి గాను అవే పాత రేట్లు పెట్టి కొనసాగించారు.

మొన్న చిరు తదితర స్టార్ హీరోలు వెళ్లి వచ్చినా కొన్ని రోజుల్లో కొత్త జీవో వస్తుంది అని అంతా అనుకున్నారు కానీ పవన్ సినిమా రిలీజ్ నాటికి ఇవ్వకుండా ఉండడంతో అందరికీ డౌట్స్ మరింత ఎక్కువయ్యాయి. అయితే దీనికి కారణం ప్రభుత్వం వైపు నుంచి ఏవన్నా ఉన్నా కొంతమంది మాత్రం బ్లాక్ మార్కెట్ కోసమే పవన్ సినిమాని టార్గెట్ చేసారని వాదిస్తున్నారు.

అయితే బ్లాక్ మార్కెట్ ఎప్పుడు నుంచో ఉన్న సంగతి తెలిసిందే. ఇది పక్కన పెడితే భీమ్లా నాయక్ సినిమాకి గాను ఉత్తరాంధ్రా లో భారీ డిమాండ్ నెలకొంది అట. అక్కడ 40 రూపాయల టిక్కెట్టు ఏకంగా 1000 నుంచి 1500 కి వెళ్తుందట.

అది కూడా ఏపీలో అధికార పార్టీ వారు కొంత మంది ఇలా చేస్తున్నారని మరికొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే భీమ్లా ని ఇలా కూడా వాడుకుంటున్నారని లాజిక్ లేని విమర్శలు కొన్ని వేస్తున్నారు. అలాగే ఇంకో పక్క ఈ సినిమాని సరైన రేట్లు లేక షో లు కూడా నిలిపి వేస్తున్నారు.