కార్మికుల ఆందోళనకు మద్దతుగా ధర్నాకు దిగిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు!

పలు కార్మికుల రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు గత కొన్ని రోజుల నుంచి బాగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రంగాలకు చెందిన కార్మికులంతా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అలా తాజాగా ధర్మోపవర్ ఉత్పత్తి కేంద్రన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలియటంతో.. తాజాగా దీనికి వ్యతిరేకంగా కార్మికుల తరఫున నుంచి బీజేపీ పోరాటానికి ముందుకు వచ్చింది.

నెల్లూరు ధర్మోపవర్ ఉత్పత్తి కేంద్రం వద్ద బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ విషయం గురించి స్పష్టత చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంకు ఉందన్నారు. ఈ విషయం గురించి మంత్రులు ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తే ఈ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.