సోము వీర్రాజు… ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నాక.. పార్టీలో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందట. నిజానికి.. ఆయన్ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించిందే పార్టీ పుంజుకుంటుందని. ఏపీలో వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే.. హైకమాండ్ సోమును బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది.
కానీ.. పార్టీకి ఆయన అధ్యక్షుడయ్యాక సీన్ అంతా రివర్స్ అయినట్టుంది. అసలు సోము వీర్రాజు రాజకీయం ఏంటో? అని అర్థం కాక పార్టీ సీనియర్ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారట.
ఎందుకంటే.. ఆయన ఎప్పుడైతే పార్టీ పగ్గాలు అందుకున్నాడో.. అప్పటి నుంచి ఆయన ఫోకస్ మొత్తం కాపు సామాజిక వర్గం మీదనే ఉందట. ఏపీలో ఎన్నో సామాజికవర్గాలు ఉండగా… ఈయన మాత్రం ఒకే దానిపై దృష్టి పెట్టడం ఏంటి అనేదానిపై బీజేపీ నేతలకు క్లారిటీ రావడం లేదట.
నిజానికి.. సోము కూడా కాపు వర్గానికి చెందిన వ్యక్తే. ఆయన కాపు కాబట్టి.. కాపుల మీద దృష్టి పెట్టాడని.. అందులోనూ రెండు గోదావరి జిల్లాల్లోనూ కాపుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయన ముందు తన దృష్టిని కాపుల మీద కేంద్రీకరించినట్టుగా తెలుస్తోంది.
అయితే.. ఆయన కాపులతో పాటుగా ఇతర సామాజిక వర్గాల మీద కూడా దృష్టి కేంద్రీకరించి ఉంటే బాగుండేది కానీ… ఆయన దృష్టి అంతా కాపుల మీదనే ఉండటంతో అది ఎక్కడికి దారి తీస్తుందో అని బీజేపీ నేతలు అయోమయంలో పడుతున్నారట.
ఎందుకంటే.. ఇప్పటికే కేవలం కాపులనే నమ్ముకొని రాజకీయాలు చేసిన వాళ్లెవరూ బాగుపడిన సందర్భాలు లేవు. అందుకే.. సోము. కాపులనే గుడ్డిగా నమ్మకూడదని హితువు పలుకుతున్నారట. కానీ.. వీర్రాజు మాత్రం కాపులను ఎటుచేసైనా… బీజేపీలోకి ఆకర్షించాలని తెగ తాపత్రయపడుతున్నాడట.
కేవలం కాపులవైపే దృష్టి సారిస్తే మిగితా వర్గాల సంగతి? మిగితా వర్గాలు బీజేపీకి దూరమయ్యే ప్రమాదం ఉంది కదా.. దాని గురించి ఎందుకు ఈయన ఆలోచించడం లేదంటూ బీజేపీ నేతలు తెగ ఆందోళన పడుతున్నారట.
గోదావరి జిల్లాల్లో ఒక వర్గానికి మద్దతు ఇస్తే.. ఇంకో వర్గానికి వ్యతిరేకం అయినట్టే లెక్క. ఆ విషయం తెలుసుకోకుండా.. కేవలం కాపుల కోసం.. మిగితా వర్గాలకు బీజేపీ పార్టీని వ్యతిరేకం చేసేస్తున్నాడని బీజేపీ నాయకులు వాపోతున్నారు. ఏది ఏమైనా.. సోము వీర్రాజు చేసే పని బీజేపీకి లేని సమస్యలను తెచ్చి పెట్టేలా ఉందని పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.