ఓమైగాడ్.. బీజేపీ నెక్స్ ట్ టార్గెట్ అదేనా? ప్రభుత్వాన్ని కూల్చేస్తుందట?

bjp is now ready to attack government

వామ్మో.. దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు విపరీతంగా వీస్తున్నాయి. తెలంగాణ నుంచి బీహార్ దాకా.. ఎక్కడ చూసినా బీజేపీదే గెలుపు. దీంతో బీజేపీ దూకుడు పెంచింది. బీజేపీయేతర రాష్ట్రాల్లో బీజేపీ టార్గెట్ పెట్టేసుకుంది. వచ్చేవి ఏ ఎన్నికలయినా గెలుపు బీజేపీదే అంటూ ముందుకు దూసుకెళ్తోంది బీజేపీ పార్టీ.

bjp is now ready to attack government

అయితే.. ప్రస్తుతం బీహార్ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ.. తన రాజకీయాలను ఇక మహారాష్ట్రకు షిప్ట్ చేసిందట. మహారాష్ట్రలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చడం కోసం బీజేపీ ఎత్తులు వేయడం ప్రారంభించిందట. మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన ప్రభుత్వం నడుస్తోంది. అయితే ఆ ప్రభుత్వాన్ని కూల్చడం అనేది అసాధ్యమే అయినా సరే.. అక్కడ పాగా వేయాలని తెగ ప్లాన్ చేస్తుందట.

మహారాష్ట్ర పరిస్థితులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు శివసేన ఎలా బీజేపీకి మద్దతు ఇచ్చిందో అందరికీ తెలుసు. బీజేపీకి తెలిసిన శివసేన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. అందుకే చిన్నగా ఎమ్మెల్యేలకు ఎర వేసే పథకానికి బీజేపీ తెర లేపిందట. ఎమ్మెల్యేను బీజేపీకి అనుకూలంగా మార్చుకొని ప్రభుత్వాన్న కూల్చడమే బీజేపీ ప్లాన్ అట.

ఇక బీహార్ ఎన్నికల సమరం కూడా ముగియడం.. బీహార్ లో గెలవడంతో ఇక ఫోకస్ మహారాష్ట్ర మీద పెట్టారట. ఇలాగే కంటిన్యూగా మహారాష్ట్ర మీద ఫోకస్ పెడితే కొద్దిరోజుల్లోనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.