దుబ్బాక గెలుపు ఖాయం అయిపోయినట్టే ఇక. దుబ్బాక ఉపఎన్నికల్లో అందరి అంచనాలను తారుమారు చేస్తూ బీజీపీ మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతోంది. మధ్యలో రెండు మూడు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. బీజేపీ మాత్రం ఓవర్ ఆల్ గా ఆధిక్యంలో ఉంది.
ఇప్పటికే 10 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. పదో రౌండ్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చినప్పటికీ.. 10 రౌండ్లు పూర్తయ్యే సరికి… బీజేపీ 3734 ఓట్ల మెజారిటీ సాధించింది. టీఆర్ఎస్ కు 28 వేల ఓట్లు రాగా… బీజేపీకి సుమారు 32 వేల ఓట్లు వచ్చాయి. ఇక.. కాంగ్రెస్ కు ఇప్పటి వరకు వచ్చిన ఓట్లు 6600 మాత్రమే.