కొడాలి నానిని పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే.. జగన్ పాలనలో హిందువులకు రక్షణ లేదు.. బీజేపీ ఆందోళన

bjp demands to expel kodali nani from ycp party

బీజేపీకి ఒక అస్త్రం దొరికింది. దాంతో ఇక అధికార పార్టీతో ఆడుకుంటోంది. ఎక్కడైనా రాజకీయాలు ఇంతే కదా. ప్రస్తుతం వైసీపీ ఇరుక్కుంది. దాన్న ఆసరాగా చేసుకొని బీజేపీ రెచ్చిపోతోంది. కొడాలి నానిని అడ్డం పెట్టుకొని బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

bjp demands to expel kodali nani from ycp party
bjp demands to expel kodali nani from ycp party

హిందూ ధర్మాన్ని అవహేళన చేసిన మంత్రి కొడాలి నానిపై ఖచ్చితంగా ఏపీ సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ డిమాండ్ చేస్తోంది. హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటంతో పాటు ప్రధాని మోదీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని చర్యలను నిరసిస్తూ ఏపీలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు.

bjp demands to expel kodali nani from ycp party
bjp demands to expel kodali nani from ycp party

జగన్ పాలనలో హిందువులకు రక్షణ లేదు. హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. హిందూ వ్యతిరేక శక్తులను తన మంత్రివర్గంలో కొనసాగించి జగన్ పెద్ద తప్పుచేస్తున్నారు. రాష్ట్ర మంత్రి అయి ఉండి.. ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అంటూ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.

కలియుగ శిశుపాలుడు కొడాలి నాని

మంత్రి కొడాలి నానిని… కలియుగ శిశుపాలుడితో బీజేపీ నేత జీవీఎల్ పోల్చారు. శిశుపాలుడు వంద తప్పులు చేశాక.. ఎలా పతనమయ్యాడో… కొడాలి నాని కూడా వంద తప్పులు చేసిన తర్వాత పతనమవ్వాల్సిందే. చంద్రబాబు ఎలా తన పతనాన్ని కోరి తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. తన తప్పు తెలుసుకొని కొడాలి నాని మంత్రి పదవి నుంచి తప్పుకుంటారా? లేక ఆయన్ను పదవి నుంచి తప్పిస్తారా? చూద్దాం.. అని జీవీఎల్ అన్నారు.