Rajendra Prasad Vs Malavika : రాజేంద్రప్రసాద్ నిజంగానే ఆమెని కొరికాడా.?

Rajendra Prasad Vs Malavika

Rajendra Prasad Vs Malavika : రాజేంద్రప్రసాద్ నటించిన ‘అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్’ సినిమా గుర్తుంది కదా. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం అందుకుంది. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆధ్యంతం నవ్వులు పూయించిన సినిమా ఇది. ఈ సినిమా అప్పట్లో వార్తల్లో సెన్సేషన్ అయ్యింది. హిట్ పరంగా కాదు. హీరోయిన్ పరంగా.

ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరంటే, మాళవిక. పెద్దగా పాపులారిటీ ఏం లేదనుకోండి. కానీ, ఈ సినిమా టైమ్‌లో అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దాంతో తెగ పాపులర్ అయిపోయిందీ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళితే, ఈ సినిమాలో ఓ ముద్దు సీన్ షూట్ చేయాల్సి వుందట. ఆ సీన్ కోసమే అమ్మడు తెగ రచ్చ చేసేసింది అప్పట్లో.

ఇప్పుడంటే, వేడి వేడిగా బాత్రూమ్, బెడ్రూమ్, పార్క్, రోడ్, బీచ్.. ఇలా ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా జస్ట్ ముద్దులే కాదు, ఏకంగా గాఢమైన మూతి ముద్దులే లాగించేస్తున్నారు హీరో, హీరోయిన్లు. కానీ, అప్పుడలా కాదు, ముద్దు సీన్ షూట్ చేయడానికి చాలా చాలా పాట్లు పడేవారు. అంతా చేసి, కెమెరా ట్రిక్కులో కానిచ్చేసేవారంతే.

కానీ, ఈ సినిమాలో హీరోయిన్‌ని రాజేంద్రప్రసాద్ నిజంగానే ముద్దు పెట్టుకున్నాడనీ, అది కూడా ఘాటు ముద్దు అనీ, ఆ క్రమంలోనే తన బుగ్గ కొరికేశాడంటూ ఆరోపణలు చేసిందట. సినిమా చేయనని చెప్పి, మధ్యలోనే షూటింగ్ ఆపేసి వెళ్లిపోయిందట. ఆ సినిమా పూర్తి చేయడానికి దర్శక, నిర్మాతలు చాలా ఇబ్బంది పడ్డారట

అయితే, నిజంగానే ఆమె రాజేంద్రప్రసాద్‌పై ఆ ఆరోపణలు చేసిందో లేక, ఆ న్యూస్ అలా బయటకి స్ప్రెడ్ అయ్యిందో తెలీదు కానీ, ఈ మధ్య ఓ ఇంటర్వ్కూలో ఇదే ఇష్యూపై ఆమె స్పందించాల్సి రాగా, నో కామెంట్ అని ఎస్కేప్ అయిపోయింది మాళవిక. ఇంతకీ ఆ ముద్దు విషయంలో తెరవెనుక అసలేం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీనే.