Bheemla Nayak Ott Release : బిగ్ అప్డేట్ : “భీమ్లా నాయక్” ఓటిటి డేట్ వచ్చేసింది..ఈ రెండిట్లో ఒకేసారి.!

Bheemla Nayak Ott Release : గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ హీరోగా మరో హీరోగా రానా దగ్గుబాటిలు నటించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం గత ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మరియు హైయెస్ట్ గ్రాస్ షేర్ అందుకున్న చిత్రంగా ఇది నిలిచింది.
అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన సమయంలోనే ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కి సంబంధించి అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయ్యిన నెల నాళ్లలో ఓటిటి లో వచ్చేస్తుంది అని టాక్ వచ్చింది. మరి ఇపుడు అది నిజం అవుతూ బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది.
ఈ చిత్రాన్ని ఈ మార్చ్ 25న రిలీజ్ చేస్తున్నట్టు నిన్న అర్ధ రాత్రి అనౌన్సమెంట్ ఇచ్చారు. అయితే ఇది ఓటిటి యాప్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు ఆహా యాప్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా ఈ రెండు యాప్స్ లో ఎలాంటి గ్యాప్ లేకుండా ఒకేరోజు స్ట్రీమింగ్ కి రానున్నట్టు అదిరే ప్రోమోస్ తో సాలిడ్ అప్డేట్స్ ఇచ్చేసారు.
మొత్తానికి అయితే ఈ పవర్ ఫుల్ అప్డేట్స్ తో పవన్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నిత్య మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం ఇచ్చాడు. అలాగే సితార వారు నిర్మాణం వహించారు.
https://twitter.com/DisneyPlusHSTel/status/1504528693430939650?s=20&t=ygTmUIAkDZ7e5rbYkE6gPw