Acharya Grand Release : బిగ్గెస్ట్ అప్డేట్ : మెగాస్టార్ “ఆచార్య” గ్రాండ్ విడుదలకి కొత్త డేట్ వచ్చేసింది.!

Acharya Grand Release : ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి రెడీగా ఉన్న పలు భారీ చిత్రాల్లో ఎక్కువ క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువ గానే ఉన్నాయి. అలాంటి సాలిడ్ మల్టీ స్టారర్స్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్ర దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ సినిమా “ఆచార్య” కూడా ఒకటి.

అయితే ఈ బిగ్ బడ్జెట్ సినిమాని రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ముందుగా ఈ ఫిబ్రవరి 4న ఎంచుకున్న సంగతి తెలిసిందే. కానీ నిన్ననే కరోనా మూడో వేవ్ కారణంగా ఈ డేట్ కి రిలీజ్ చెయ్యడం లేదని బ్యాడ్ న్యూస్ అందించారు. అయితే కొత్త డేట్ ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు కానీ త్వరగా అనౌన్స్ చేస్తారని ఊహించి ఉండరు.

అలాగే ఇప్పుడు మేకర్స్ ఈ బిగ్ అప్డేట్ ని రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని ఈ ఏప్రిల్ 1న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఒక్కసారిగా ఈ ఊహించని అప్డేట్ మంచి వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు చిరు చరణ్ ల సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.