Megastar Chiranjeevi : మెగా ఫ్యాన్స్ కి పూనకాలు..ఆ సినిమాలో చిరు లుక్ అదిరిపోయిందట.!

Megastar Chiranjeevi : తమ అభిమాన హీరోలని ఎప్పటికప్పుడు సరికొత్తగా చూడాలని ప్రతి హీరో ఫ్యాన్ కూడా కోరుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే అలరించేందుకు మన స్టార్ హీరోలు కూడా చాలా కష్టపడతారు. కానీ తమ అభిమానుల కోసం వయసు మీద పడుతున్నా కూడా ఇంకా యంగ్ గా కనిపించి మళ్ళీ పాత రోజుల ట్రీట్ ని ఇవ్వడానికి సీనియర్ హీరోలు పడే కష్టాలు కూడా అంతా ఇంతా కాదు.
తమిళ్ లో అయితే రజినీకాంత్ కమల్ హాసన్ లు మలయాళంలో అయితే మోహన్ లాల్ మమ్ముట్టి లు కాగా మన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మరియు వెంకీ మామ, కింగ్ నాగ్ లు ఉన్నారు. అయితే వీరి అందరిలో కూడా చిరు ఒకరు మాత్రం ఇప్పుడు హీరోలకి కూడా ధీటైన మార్కెట్ తో నిలబడి ఉన్నారు.
మరి అలా చిరు తాను లేటెస్ట్ గా చేస్తున్న సినిమాల్లో కాస్త వింటేజ్ షేడ్స్ ఉన్న చిత్రం దర్శకుడు బాబీ తో చేస్తున్నారు. మెగాస్టార్ 154వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ సినిమాలో చిరు ని మొదటి నుంచి పాత చిరంజీవిని గుర్తు చేసేలా మాస్ గా ప్రెజెంట్ చేస్తానని దర్శకుడు ప్రామిస్ చేసాడు.
అయితే ఇపుడు ఆ మాట నిజమే అని మెగా ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ అని ఈ సినిమా సెట్స్ లో మెగాస్టార్ లుక్ చూసాక సంగీత దర్శకుడు థమన్ అంటున్నాడు. మెగాస్టార్ లుక్ ఈ సినిమాలో అదిరిపోయిందని చిరు లుక్ డాషింగ్ గా ఉందని దారుస్సకుడ్ బాబీ ఒక ఫ్యాన్ గా చిరు ని మళ్ళీ గ్యాంగ్ లీడర్ రోజులు గుర్తు చేసేలా ప్రెజెంట్ చేస్తున్నారని నేను ఇంకా ఆ హై లోనే ఉన్నానని థమన్ అంటున్నాడు.
దీనితో ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే మళ్ళీ చాలా కాలం తర్వాత మెగా ఫ్యాన్స్ కి చిరు నుంచి వేరే లెవెల్ ట్రీట్ సిద్ధం అవుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిన్ననే శృతి హాసన్ ని అనౌన్స్ చెయ్యగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
https://twitter.com/MusicThaman/status/1501184674051559424?s=20&t=cUVnDI0jcquz3lQETLeFEQ