బుల్లితెర ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ బాషలలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న ఈ కార్యక్రమంలో తెలుగులోను మంచి ఆదరణ పొందుతుంది. తొలి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా ఉన్నాడు. ఇక మూడు, నాలుగు సీజన్స్‌ని నాగార్జున హోస్ట్ చేసి భారీ రేటింగ్ తెప్పించాడు. ఐదో సీజన్‌కు కూడా నాగార్జుననే హోస్ట్‌గా కన్‌ఫాం కాగా, కంటెస్టెంట్స్ ఎవరు గత సీజన్‌లో బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ని ప్రశ్నలు అడిగిన రాహుల్ స్థానంలో ఎవరు ఎంపిక అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ సీజన్ 4 కరోనా వలన కాస్త లేట్ అయింది. హౌజ్‌మేట్స్‌ని క్వారంటైన్ లో ఉంచి, కరోనా నిబంధనలు పాటిస్తూ సీజన్ 4 కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించారు.ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా సీజన్ కార్యక్రమం ముగియగా, ఇప్పుడు సీజన్ 5కు రంగం సిద్ధం అయింది. ఏప్రిల్ నెలాఖరులోనో లేదంట జూన్ మొదటి వారంలోనో ఈ షో మొదలు కానున్నట్టు సమాచారం. ఇప్పటికే కంటెస్టెంట్స్ ప్రక్రియ మొదలు కాగా,గత సీజన్ కన్నా భిన్నంగా ఈ సీజన్‌ని జరపాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తుంది.
గత సీజన్‌లో కంటెస్టెంట్స్ అందరు దాదాపు కొత్త వారే. దీంతో తొలినాళ్ళలో రేటింగ్ చాలా డల్ అయింది. రాను రాను జనాలకు వారి పేర్లు నోటెడ్ కావడం, ప్రవర్తన నచ్చడంతో ఓన్ చేసుకున్నారు. అయితే ఈ సారి గతంలోలా కాకుండా మంచి పేరున్న ఆర్టిస్టులనే ఎంపిక చేయాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఇక బయటకు వచ్చిన కంటెస్టెంట్స్‌ని సీజన్ 3లో తనుష్ ఇంటర్వ్యూ చేయగా, సీజన్ 4లో రాహుల్ చేశాడు. సీజన్ 5కు సోహెల్ హౌజ్‌మేట్స్‌ని ఇంటర్వ్యూ చేసే హోస్ట్‌గా ఉంటాడని సమాచారం. మరో విషయం ఏమంటే సీజన్ 5లో సినీ నటులని ఎక్కువగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.