Himaja: బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి హిమజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్ లో పలు వీడియోల ద్వారా ఫేమస్ అయిన హిమజ ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదేవిధంగా తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షో తో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇదిలా ఉంటే హిమజ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. హిమజ ఇంస్టాగ్రామ్ లో తన భర్తను అన్ ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే హిమజ తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకు హిమజ కు పెళ్లి అయింది అన్న విషయం పై అభిమానులకు క్లారిటీ రాలేదు. అలాంటిది ఏకంగా పెళ్లి, విడాకులు అన్న పదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అసలు విషయం ఏమిటి అన్నది తెలియక నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. తాజాగా ఇదే విషయంపై హిమజ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో హిమజ స్పందిస్తూ.. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లోనే పెళ్లిళ్లు, విడాకులు, చేసేస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి నేను పెద్దగా పట్టించుకోను. కానీ మా తల్లిదండ్రులు కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల వాళ్ళు ఎక్కువగా బాధపడతారు.
కాబట్టి దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ లో ప్రచారం చేయకండి. అదేవిధంగా నా పెళ్లి విడాకులకు నన్ను తప్పకుండా పిలవండి అంటూ కాస్త వ్యంగ్యంగా స్పందించింది. అనంతరం తన పెళ్లి గురించి మాట్లాడుతూ తాను 3,4ఏళ్లలో తప్పకుండా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే చాలా గ్రాండ్‌గా అందరికి చెప్పి చేసుకుంటానని తెలిపింది. అలాగే పెళిళ్లు నాకు సెట్ కావు ప్రస్తుతం సింగిల్‌గా హ్యాపీగా ఉంటూ మా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాను. సింగిల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. గత కొన్ని రోజులుగా నా వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో కొందరు కుట్ర పన్ని ఇలాంటి ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తున్నారు అంటూ తనపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టేసింది హిమజ.