బిగ్ బాస్ తెలుగు 5: తర్వాతి వికెట్ ఎవరిదో తెలుసా.?

బిగ్ బాస్ సీజన్ 5 చప్పగా సాగుతోందా.? జుగుప్సాకరంగా సాగుతోందా.? ఉత్సాహంగా సాగుతోందా.? అంటే, నో డౌట్.. జుగుప్సాకరంగానే సాగుతోందని చెప్పక తప్పదు. ఉమా దేవితో బూతులు తిట్టించి.. ఆమెను బిగ్ హౌస్ నుంచి బయటకు గెంటేశారు రెండో వారం. ఫస్ట్ వికెట్ సరయు పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఆమె హౌస్‌లో తిట్టిందో లేదోగానీ, బయటకు వచ్చాక మాత్రం జుగుప్సాకరంగా మాట్లాడింది. ఇప్పుడు వంతు ప్రియది. సీనియర్ నటి ప్రియ మూడో వికెట్‌గా బిగ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోబోతోందట. అదేంటీ, ఇంకా ఎలిమినేషన్ కోసం జరిగే నామినేషన్ ప్రక్రియలో ప్రియ పేరు ఖరారు అవకుండానే ఎలిమినేటెడ్ క్యాండిడేట్ ఎలా డిసైడ్ అయిపోయింది.? అంటే, అదంతే.. అలాగే బిగ్ హౌస్ నుంచి లీకులు బయటకు వస్తుంటాయ్.

ఏదో అద్భుతం జరిగితే తప్ప, ప్రియ ఈ వారం ఎలిమినేట్ కాకుండా సేఫ్ అయ్యే పరిస్థితి లేదనీ, ఒకవేళ ప్రియ ఎలిమినేషన్ ఆపాలనుకుంటే మాత్రం ఇంకెవరో బలిపశువు అయిపోతారనీ అంటున్నారు. ఒకేసారి హౌస్‌లోకి ఎక్కువమందిని పంపేయడం వల్ల హౌస్ అంతా గందరగోళంగా తయారైంది. పైగా, ఎవరికి వారు స్క్రీన్ స్పేస్ కోసం అడ్డమైన వేషాలూ వేస్తున్నారు. ఉమాదేవి – లోబో మధ్య లవ్ ట్రాక్ కూడా అలాంటిదేనట.. ఆ విషయాన్ని ఉమాదేవి స్వయంగా వెల్లడించింది. అంటే, ఇదంతా పూర్తిగా బిగ్ బాస్ డైరెక్షన్‌లో జరుగుతోన్న స్క్రిప్టెడ్ వ్యవహారం అన్నమాట. ఇంతకీ, ప్రియ గెంటి వేత ఖాయమైపోయినట్టేనా.? అందుకేనా.. ఆమె క్యారెక్టర్ మీద దెబ్బకొట్టేలా.. ఆమెతో చెత్త బిహేవియర్ ప్రదర్శించేలా చేసింది.? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, ఈ వీకెండ్ వరకూ వేచి చూడక తప్పదు.