Bigg Boss OTT Telugu: చెప్పులతో కొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్.. అసలేం జరిగిందంటే..?

Bigg Boss OTT Telugu: తెలుగు బుల్లితెరపై తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలైన విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ మొదలయ్యి కొద్ది రోజులు కూడా గడవకముందే, కంటెస్టెంట్ ల మధ్య గొడవలు హౌస్ ని హీటెక్కిస్తున్నాయి. అంతే కాకుండా పలువురు బూతులు మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి, అరియానా చెప్పులతో కొట్టుకున్నారు. ఈ విషయం పట్ల హర్ట్ అయిన అరియానా చెప్పుతో కొట్టడం తనకు నచ్చలేదని చెప్పింది. అప్పుడు అషు నువ్వు అలా చేసావ్ కాబట్టి నేను కూడా అలాగే చేశాను అని చెప్పింది అషురెడ్డి. ఇక వెంటనే అరియానా అషు రెడ్డి కి సారీ చెప్పింది.

మరొక వైపు అషు తన సిగరెట్‌ ప్యాకెట్ లు దాచింది అన్న అనుమానంతో ఆమెకు సంబంధించిన బ్యాగ్‌ను దాచేశాడు యాంకర్‌ శివ. ఎలాగైనా తన బ్యాగ్‌ను తిరిగి రాబట్టాలనుకున్న అషు రెడ్డి, శివ ఎలా అయిపోతున్నాడో చూడండి, సిగరెట్లు తాగకుండా ఉండలేకపోతున్నాడు, పిచ్చెక్కిపోతున్నాడు, గజతాగుబోతుగా తయారైపోతున్నాడు అంటూ కామెడీ చేయడం మొదలు పెట్టడంతో శివ వెంటనే లేచి ఆమె బ్యాగును అప్పజెప్పాడు.