Himaja: విడుదలకు సిద్ధమైన నటి హిమజ.. తనకు పెళ్లి అయిందా అంటూ నెటిజెన్స్ షాక్!

Himaja: కొంచెం ఇష్టం కొంచెం కష్టం తెలుగు సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన హిమజ ఆ తర్వాత అడపాదడపా సినిమాలలో కనిపించింది.ఈ విధంగా పలు సీరియల్స్ సినిమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయింది. ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె సొంతం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

ఇలా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిమజ తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు షాక్ అవుతారు అసలు పెళ్లి ఎప్పుడు జరిగింది అంటూ కామెంట్ చేస్తున్నారు..అసలు హిమజ కు పెళ్ళైన సంగతి ఇంతవరకు ఖచ్చితంగా తెలియదు.

హిమజ తన యూట్యూబ్ ఛానల్ లో కానీ, వేరే ఇతర సందర్భాలలో కానీ పెళ్లి గురించి చెప్పలేదు.కానీ గూగుల్ లో మాత్రం హిమజ గురించి సెర్చ్ చేసినపుడు రాజేష్ ఆనంద్ అనే వ్యాపారవేత్తను 2012 లో వివాహం చేసుకున్నట్లు ఉంది. కాగా పెళ్ళైన కొద్ది కాలానికి విడిపోయి చల్లా విజయ్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లిచేసుకునట్లు సమాచారం. ఇపుడు అతనితో కూడా వీడిపోవాలనుకుంటోందని వార్తలొస్తున్నాయి. ఈ మధ్య కాలంలో విడాకుల గోల ఎక్కువైంది. మొన్న సమంత, నాగచైతన్య నిన్న ధనుష్, ఐశ్వర్య వారి వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. మరి హిమజ కూడా వీరి బాటలోనే విడాకులు తీసుకోబోతోందా, లేక అసలు తనకు పెళ్లి జరిగిందా లేదా అనే ఈ విషయం తెలియాలంటే హిమజ స్పందించాల్సి ఉంది.