Pallavi Prashanth: అల్లు అర్జున్‌తో పోల్చుకుంటూ అలాంటి పోస్ట్ చేసిన పల్లవి ప్రశాంత్.. మండిపడుతున్న బన్నీ ఫ్యాన్స్!

Pallavi Prashanth: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ బాస్ విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకముందు సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. రైతు బిడ్డ అనే ట్యాగ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి భారీగా సింపతిని సంపాదించుకున్నాడు. అదే సింపతీ తోనే లాస్ట్ వరకు వచ్చి ఫైనల్ గా విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే పల్లవి ప్రశాంత్ లో బిగ్ బాస్ హౌస్ కి వెళ్లకముందు వెళ్లిన తర్వాత చాలా మార్పు వచ్చిన విషయం తెలిసిందే.

విన్నర్ గా నిలిచిన తర్వాత యాటిట్యూడ్ చూపించడం మొదలు పెట్టాడు పల్లవి ప్రశాంత్. ఇదే విషయంపై చాలాసార్లు ట్రోలింగ్స్ ని ఎదుర్కొన్నాడు పల్లవి ప్రశాంత్. తాజాగా మరోసారి పల్లవి ప్రశాంత్ పై ట్రోల్స్ చేస్తున్నారు నైటిజన్స్. అసలేం జరిగిందంటే.. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు స్పందించారు.. తాజాగా ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ కూడా స్పందిస్తూ ఒక పోస్ట్ చేశారు. కాగా బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల పాటు చంచల్ గూడ జైలులో ఉంచారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు కావడంతో బయటకు వచ్చాడు.

ఇప్పుడు దీనిని మరోసారి గుర్తుకు చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అల్లు అర్జున్‌ అరెస్ట్‌ని తన అరెస్ట్‌తో కంపేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు రైతు బిడ్డ. దీనికి ఏకంగా ఇండియన్ హీరోస్ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. పల్లవి ప్రశాంత్ షేర్ చేసిన పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు మండి పడుతున్నారు. ముఖ్యంగా బన్నీ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. కొంచెం ఓవర్ అయ్యింది బ్రో.. అల్లు అర్జున్ తో పోలీకేంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ పోస్ట్ పై అల్లు అర్జున్ అభిమానులు మండి పడుతూ పల్లవి ప్రశాంత్ పై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు పల్లవి ప్రశాంత్ రైతులకు ఇస్తానన్న హామీని గుర్తు చేస్తూ..ఎనిమిదో సీజన్ కూడా అయిపోయింది కదా బ్రో.. రైతులకు ఇస్తానన్నా డబ్బులేవి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయినా నీకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పోలిక ఏంటి? కాస్త ఓవర్గా అనిపించడం లేదు అంటూ మండిపడుతున్నారు.