Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 : ఈసారి గ్రాండ్ ఫైనల్స్ రేటింగ్ వచ్చేసింది! ఎంతొచ్చిందో తెలుసుకోండి

Bigg Boss 5 Telugu : తెలుగు బుల్లితెర వీక్షకులు ఎంతో ఆసక్తిగా చూసే టెలివిజన్ షోస్ లో స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే గ్రాండ్ రియాలిటీ షో “బిగ్ బాస్” కూడా ఒకటి. ఇప్పటి వరకు నాలుగు సీజన్ల ను కంప్లీట్ చేసుకొని ఐదవ సీజన్ ని ఈ ఏడాది స్టార్ట్ చేసుకుని జస్ట్ కొన్ని రోజులు కితమే దీనిని కూడా పూర్తి చేసుకుంది.

మరి ఈ భారీ రియాలిటీ షో మొదటి సీజన్ నుంచే ఇండియాలోనే అధిక రేటింగ్ అందుకుంటున్న షో గా నిలిచి ఆల్ టైం రికార్డులే సెట్ చేసింది. అయితే ఒక్కో సీజన్ కి గాను భారీ రేటింగ్ తో పెంచుకుంటూ వెళుతున్న ఈ షో ఈసారి కూడా ఎంత రేటింగ్ తెచ్చుకుంటుంది? గత సీజన్ల కంటే ఎక్కువ తెచ్చుకొని కొత్త రికార్డు సెట్ చేసిన అనే అనేక ప్రశ్నలకి సమాధానం ఈరోజు ఫైనల్ గా దొరికేసింది.

అయితే ఈసారి సీజన్ గత సీజన్ రేటింగ్ ని బ్రేక్ చెయ్యలేకపోయిందట. గత సీజన్ కి 19 రేటింగ్ కి పైగా రాగా ఈసారి సీజన్ కి కేవలం 16.04 రేటింగ్ మాత్రమే వచ్చిందట. ఇది ఊహించని రేటింగ్ అని చెప్పాలి. దీనిని బట్టి షో పట్ల ఆడియెన్స్ లో కూడా కాస్త ఆసక్తి లోపించినట్టే అని చెప్పాలి. ఇకనైనా మరికాస్త కొత్తగా ఏమన్నా ప్లాన్ చేస్తారో లేదో చూడాలి. పైగా మరోపక్క ఓటిటి వెర్షన్ ని కూడా స్టార్ట్ చేస్తాం అంటున్నారు.