Bigg Boss 5 Telugu: అయ్యో, గూగులమ్మ..! ప్రసారం కాకముందే ఫైనలిస్ట్స్ ఎవరో చెప్పేసిందే..!

Bigg Boss 5 Telugu: బుల్లితెరలో దూసుకుపోతున్న నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్. నాగార్జున వరుసగా మూడోసారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో విజయవంతంగా 98 రోజులు పూర్తి చేసుకుని పదిహేనో వారంలోకి అడుగు పెట్టింబోతుంది. ఇంకొక వారం రోజులు మిగిలి ఉన్న ఈ షో లో ప్రతి వారం ఏదోకటి జరుగుతూనే వచ్చింది.

గేమ్ విజయవంతంగా ముందుకు సాగాలంటే ప్రతి వారం ఏదొక కంటెస్టెంట్ నామినేట్ అయ్యి ఎలిమినేట్ అవ్వాల్సిందే. అలా ఇప్పటికే పద్నాలుగు మంది సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ప్రియా, లోబో, విశ్వ, జెస్సీ, అని మాస్టర్, రవి, ప్రియాంక సింగ్, కాజల్ ఎలిమినేట్ అయ్యారు.

అయితే, ఆదివారం ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాకముందే పద్నాలుగో వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో ముందుగానే గూగుల్ వికీపీడియాలో అప్డేట్ చేసింది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఫైనలిస్ట్స్ ఎవరో కూడా చెప్పేసింది. షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతు, విజే సన్నీ, మానస్ నాగుల పల్లి, శ్రీరామా చంద్ర మైనంపాటి ఫైనల్ కి చేరినట్లు కూడా తెలిపింది.