డైరెక్టర్ సూర్య కిరణ్ అని డైరెక్ట్‌గా చెబితే ఏ ఒక్కరూ గుర్తు పట్టరేమో గానీ, సత్యం సినిమా దర్శకుడు అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ డైరెక్టర్ తన జీవితంలో ఎన్నో డక్కాముక్కీలు తిన్నట్టు కనిపిస్తోంది. హీరోయిన్ కళ్యాణితో వేరు పడటం, సినీ కెరీర్ అంతంత మాత్రంగానే ఉండటం వెనుక పెద్ద కథే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న కనెక్షన్స్ గేమ్ ఆడించిన సందర్భంగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.
కనెక్షన్స్ గేమ్‌లో భాగంగా సూర్య కిరణ్.. నమ్మకస్తుడు, స్ట్రిక్ట్, గజిబిజీ అనే కేటగిరీలను ఎంచుకున్నాడు. వీటినే ఎందుకు ఎంచుకున్నాడో సూర్య కిరణ్ వివరించాడు. తన జీవితంలో నమ్మకస్తులు లేనందుకు ఇలా ఉన్నానని, అందరూ మోసం చేశారన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అందుకే ఓ నమ్మకస్తుడు కావాలని తెలిపాడు. అంతేకాకుండా తాను స్ట్రిక్ట్‌గా ఉండను కాబట్టి.. వచ్చేవారు అలా ఉంటే తనను కంట్రోల్ చేస్తారని తెలిపాడు. గజిబిజీ అంటే కాస్త ఎంటర్టైన్ కూడా ఉంటుందని పేర్కొన్నాడు.
ఇందులో నమ్మకస్తుడు అనే కేటగిరీ గురించి చెబుతూ ఉంటే.. నాగార్జున పదే పదే సెటైర్లు వేశాడు. నువ్ నమ్మకస్తుడు కాదంటూ పంచ్‌లు వేశాడు. దీని వెనుక కూడా ఏదో మర్మం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక భార్య హీరోయిన్ కళ్యాణి నుంచి వేరుపడటం, విడిగా ఉండటం, వ్యక్తిగత సమస్యలు ఇలా సూర్య కిరణ్ జీవితంలో చాలానే చూసినట్టున్నాడు. మరి ఈ బిగ్‌బాస్ దర్శకుడికి ఎలాంటి ఇమేజ్‌ను ఇస్తుందో చూడాలి.