దేత్తడి హారిక గురించి సోషల్ మీడియాలో అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రస్టేటెడ్ స్టూడెంట్, మదర్, ఇంటి ఓనర్ ఇలా రకరకాల క్యారెక్టర్లు చేస్తూ గుక్క తిప్పుకోకుండా తెలంగాణ యాసలో అదరగొట్టే దేత్తడి హారిక బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బిగ్‌బాస్ స్టేజ్ మీద మోడ్రన్ డ్రెస్‌లతో హాట్ హాట్‌గా కనిపించే సరికి ఆమేనా? ఈమె అని పోల్చుకోవడంలో కొందరు విఫలమయ్యారు. అయితే బిగ్‌బాస్ గురించి ఇంట్లో చెప్పడంతో వారి రియాక్షన్ ఎలా ఉందో వివరించింది.
చిన్నప్పటి నుంచి బిగ్‌బాస్ షో అంటే ఫాంటసీ అని, తనకంటే తన అమ్మకే ఎక్కువగా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఏ భాషలో వచ్చినా సరే చూసేదని, అన్నం తినిపిస్తూ చిన్నప్పుడు మాకు కూడా బిగ్‌బాస్ చూపించేదని తెలిపింది. అప్పటి నుంచి ఆ కోరిక ఉండేది. ఒక్కసారైనా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలనే కోరిక ఉండేదని చెప్పుకొచ్చింది. లక్కీగా ఈసారి ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే చెప్పేశాను అని తెలిపింది.
బిగ్‌బాస్ ఆఫర్ గురించి ఇంట్లో చెప్పడంతో అందరూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు.. వెంటనే ఇంట్లోంచి వెళ్లిపో అని అమ్మ ఎంతో సంతోషంగా చెప్పింది. అలా బిగ్‌బాస్‌లోకి వచ్చాను, ఎలాంటి ప్లానింగ్స్ లేవని పేర్కొంది. పులిహోర కలపడం వచ్చా, ఒకవేళ ఎవరైనా హౌస్‌లో ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావ్? అని హారిక నాగ్ అడగడంతో ఓ చిన్న హింట్ ఇచ్చినట్టైంది. ఈ సారి లవ్ ట్రాక్ ఈమెతోనే నడిపించబోతోన్నాడని తెలుస్తోంది. మరి చూడాలి దేత్తడి హారిక ఏం చేస్తుందో.