బిగ్ అప్డేట్ : మహేష్ భారీ సినిమాలో నందమూరి హీరో గాసిప్ నిజం రివీల్.!

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ సాలిడ్ సినిమా మహేష్ కెరీర్ లో ఇంకో భారీ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న హ్యాట్రిక్ సినిమా కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి గత కొన్ని రోజులు కితం ఒక మాసివ్ గాసిప్ వినిపిస్తూ వచ్చింది. ఈ సినిమాలో నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి తారక రత్న విలన్ గా ఫిక్స్ అయ్యాడని గాసిప్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు దీనిపై ఏకంగా ఈ నటుడే బిగ్ క్లారిటీ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాను ఈ సినిమాలో ఉన్నట్టు అది కూడా విలన్ గానే కనిపిస్తానని చెప్పకనే చెప్పేసాడు. దీనితో ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో మహేష్ ని ఢీ కొట్టే విలన్ ఇతడే అని కన్ఫర్మ్ అయ్యిపోయింది. అయితే త్రివిక్రమ్ సినిమాలు అంటేనే క్యాస్టింగ్ చాలా బలంగా ఉంటుంది.

ఇప్పుడు ఈ నటుడు కన్ఫర్మ్ అవ్వడం అదనపు బలమే అని చెప్పాలి. అయితే ఇది నిజంగా తారక్ రత్న అకౌంటేనా కాదా అని ఫ్యాన్స్ అయితే క్లారిటీ కోరుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా ఓకే అవ్వగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే హారిక హాసిని వాళ్ళు చాలా గ్రాండ్ స్కేల్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

https://twitter.com/NTarakarathna/status/1530447174839902208