Big Update On Megastar Chiranjeevi : బిగ్ అప్డేట్ : తన సినిమాలో పూరీ రాకపై కీలక నిజం బయటపెట్టిన చిరంజీవి.!

big update on megastar chiranjeevi s god father movie
Big Update On Megastar Chiranjeevi: ప్రస్తుతం మన టాలీవుడ్ లో నడుస్తున్న మల్టీ స్టారర్ ట్రెండ్ కోసం అందరికీ తెలిసిందే. పలువురు బిగ్ స్టార్స్ కలిసి సినిమాలు చేస్తూ ఆడియెన్స్ కి భారీ ట్రీట్ ని అందిస్తున్నారు. మరి ఈ ఇలాంటి సినిమాల్లో టాలీవుడ్ దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా చేస్తున్న సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి.
వాటిలో దాదాపు అన్నీ మల్టీ స్టారర్ సినిమాలే ఉండగా వాటిలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా ఓ బజ్ బయటకి వచ్చింది. దర్శకుడు మోహన్ రాజాతో చేస్తున్న భారీ సినిమా “గాడ్ ఫాదర్” లో టాలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడని గాసిప్స్ రాగా ఇపుడు అది నిజం అయ్యింది.
స్వయంగా దీనిపై మెగాస్టార్ నే అప్డేట్ ఇచ్చి తమ సినిమాలో కీలక పాత్ర చేసేందుకు పూరి జగన్నాథ్ ని ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అలాగే పూరి జగన్నాథ్ వెండితెర అరంగేట్రంపై ఒక కీలక నిజాన్ని కూడా బయట పెట్టారు. “నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.
స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే పూరి జగన్ ని నా సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను” అని మెగాస్టార్ ఈ బిగ్ అప్డేట్ ని రివీల్ చేస్తూ అసలు పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చాడో బయట పెట్టారు.