Avatar 2 Trailer : క్లారిటీ ఇచ్చేసిన మేకర్స్.!

Avatar 2 Trailer :  ప్రపంచ స్థాయి సినిమా దగ్గర నెవర్ బిఫోర్ వసూళ్లతో భారీ వసూళ్లు కొల్లగొట్టిన ఏకైక సినిమా “అవతార్” పేరుని ప్రత్యకంగా పరిచయం చెయ్యాల్సిన పని లేదు. మన దేశంలో కూడా రికార్డు స్థాయి వసూళ్ళని అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేసాక నెలకొన్న అంచనాలు కూడా అన్ని ఇన్ని కావు.
ఇక ఇదిలా ఉండగా ఈ రెండు మూడు రోజుల్లో అవతార్ 2 స్పెషల్ టీజర్ ప్రీమియర్ తో మరోమారు ప్రపంచ సినిమా వద్ద అవతార్ 2 పేరు గట్టిగా వినిపించింది. అయితే ఈ సమయంలోనే ఈ సినిమా ట్రైలర్ మరి మిగతా వాళ్ళు చూసేది ఎప్పుడు అనే ప్రశ్న లేవనెత్తింది.
ఇక దీనికి గాను చిత్ర మేకర్స్ అధికారిక క్లారిటీ ఇచ్చేసారు. గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్న గాసిప్ ని నిజం చేస్తూ తాము ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని మర్వెల్ వారి సినిమా డాక్టర్ స్ట్రేంజ్ కొత్త సినిమా తో అటాచ్ చేసి రిలీజ్ చేస్తున్నామని అందులో “అవతార్ 2” ట్రైలర్ ని విట్నెస్ చెయ్యొచ్చని తెలియజేసారు.
అంటే ఈ సినిమా ట్రైలర్ ఈ మే 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి “అవతార్ ది వే ఆఫ్ వాటర్” టైటిల్ ని ఫిక్స్ చెయ్యగా కేవలం థియేటర్స్ లోనే ఈ ట్రైలర్ వస్తున్నట్టు తెలిపారు. ఇంకా యూట్యూబ్ రిలీజ్ పై అయితే ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు.
https://twitter.com/officialavatar/status/1519700499406069761