బిగ్ అప్డేట్ : మెగాస్టార్ తో మిల్కీ బ్యూటీ మళ్ళీ..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సాలిడ్ రీమేక్స్ అలాగే ఒక స్ట్రైట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీమేక్ చిత్రాల్లో దర్శకుడు మెహర్ రమేష్ తో ప్లాన్ చేసిన భారీ సినిమా “భోళా శంకర్” కూడా ఒకటి. తమిళ్ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా చేస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడి చేశారు.

ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చిరు సరసన హీరోయిన్ గా చేస్తున్నట్టు అధికారికంగా అప్డేట్ ఇచ్చారు. గతంలో వీరిద్దరూ “సైరా నరసింహా రెడ్డి” అనే భారీ పాన్ ఇండియా సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబో రిపీట్ కాబోతుంది. ఇక ఈ చిత్రం ముహూర్తం వచ్చే 11న ఉదయం 7:45కి ఫిక్స్ అయ్యినట్టు కూడా ఇందులో తెలిపారు. అలాగే ఈ సినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తీ సురేష్ నటిస్తున్నా సంగతి తెలిసిందే.