లేటెస్ట్ : రాధికతో మెగాస్టార్ ఒక బడా ప్రాజెక్ట్!

Megastar And Radhika : మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లో సీనియర్ హీరో హీరోయిన్ల కాంబినేషన్ కూడా ఒకటి. ఇప్పుడు ఎలా అయితే కొన్ని క్రేజీ కాంబినేషన్ లు ఉన్నాయో అలాగే అప్పుడు కూడా కొన్ని హిట్ కాంబినేషన్ లు ఉన్నాయి.
మరి అలాంటి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు నటి రాధికా ల కాంబో కూడా ఒకటి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గాని అలాగే వీరి కామెడీ టైమింగ్ లు గాని ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి. అయితే ఈ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతున్నట్టు ఇప్పుడు లేటెస్ట్ గా కన్ఫర్మ్ అయ్యింది.
ఇక ఇంకా డీటెయిల్డ్ గా వెళ్లినట్టు అయితే రాధిక తో సినిమా అంటే ఆమెతో నటించడం కాదు రాధికా భర్త అయినటువంటి రాధికా శరత్ కుమార్ ల కాంబోలో ఉన్న ప్రొడక్షన్ బ్యానర్ అయినటువంటి రాధన్ ప్రొడక్షన్ హౌస్ లో చిరు ఒక బిగ్ ప్రాజెక్ట్ చెయ్యడానికి ఓకే చెప్పారట.
దీనిని స్వయంగా రాధికా ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఫ్యూచర్ లో ఈ సినిమా మొదలు కానుంది అని కింగ్ ఆఫ్ మాస్ అయినటువంటి మెగాస్టార్ తో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని ముందే ఆమె చెప్పేసింది. దీంతో మెగాస్టార్ నుంచి మరో సాలిడ్ ప్రాజెక్ట్ సిద్ధం అవుతుందని కన్ఫర్మ్ అయ్యింది.
https://twitter.com/realradikaa/status/1520592143831945216?s=20&t=eYDDGN2LSgg5LvvFpzrUNA