మాసివ్ అప్డేట్ : “పుష్ప 2” లో నటించే అవకాశం మీదే..ఎప్పుడు ఎక్కడ అంటే.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో నిలబెట్టిన లేటెస్ట్ సినిమా “పుష్ప ది రైజ్” అని చెప్పాలి. ఈ సినిమాతో భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని ఇప్పుడు పార్ట్ 2 సిద్ధం అవుతుండగా దర్శకుడు సుకుమార్ ఆల్రెడీ స్క్రిప్ట్ ని లాక్ చేసేసాడు. 

ఇంకా ఈ రెండు నెలల లోనే షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉండగా ఇప్పుడు ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు మాసివ్ అప్డేట్ ని సినిమాల్లో అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అవకాశం ఇస్తున్నట్టు బిగ్ అప్డేట్ తో ముందుకు వచ్చారు. 

తాము చేస్తున్న పుష్ప పార్ట్ 2 పుష్ప ది రూల్ లో నటించేందుకు కొత్త నటీ నటులు ఏ ఏజ్ లో ఉన్నా వారు అయినా కూడా పర్వాలేదని ఆహ్వానం పలికారు. అయితే ఈ ఆడిషన్స్ ని ముందు తిరుపతిలో చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ జులై 3 నుంచి 5వ తారీఖు వరకు కూడా మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ లో న్యూ బాలాజీ కాలనీ, తిరుపతిలో చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. 

అలాగే మరో ముఖ్య గమనిక ఏమిటంటే చిత్తూర్ యాస తప్పక వచ్చి తీరాలని మెన్షన్ చేశారు. ఈ ఆడిషన్ లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్టు తెలిపారు. మరి మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే వెళ్లి మీ టాలెంట్ నిరూపించుకోవచ్చు.