Bheemla Nayak : టాక్ : “భీమ్లా నాయక్” నుంచి బిగ్ అప్డేట్ కి సిద్ధమా??

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రల్లో నిత్యా మీనన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్ లుగా యంగ్ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం “భీమ్లా నాయక్”. మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని శరవేగంగా మేకర్స్ పూర్తి చేస్తుండగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తన పార్ట్ వరకు షూటింగ్ ముగించేసుకుని ఇప్పుడు తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఈ చిత్రం నుంచి ఇప్పుడు ఒక బిగ్ అప్డేట్ రానున్నట్టుగా సాలిడ్ బజ్ వినిపిస్తుంది. వచ్చే డిసెంబర్ 14న సినిమాలో డానియల్ గా చేసిన హల్క్ హీరో రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా ఈ కీలక ట్రీట్ ని అందించనున్నారట. మరి దీనిపై అప్డేట్ నే రేపు ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతానికి అయితే మోస్ట్ అవైటెడ్ టీజర్ వస్తుంది అని సమాచారం. మరి అదేంటీ అనేది వేచి చూడాలి. ఇదిలా ఉండగా మరోపక్క ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందా లేదా అనేదానిపై కూడా చాలా మంది మళ్ళీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో దీనిపై కూడా ఈ అప్డేట్ లో ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి.