RRR : బిగ్ ట్విస్ట్ : “RRR” సినిమా వాయిదా పడడం మళ్ళీ కన్ఫర్మ్??

RRR : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో ఆలియా భట్ మరియు ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ గ్యాప్ లోనే చిత్ర బృందం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ని చేస్తున్నారు.

అన్ని భాషల్లో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లు చేస్తుండగా మళ్ళీ ఇప్పుడు వీటన్నిటికీ బ్రేక్ పడనున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ చిత్రం ఈ సినిమా మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందని ఊహించని టాక్ వినిపిస్తుంది. అది కూడా ఎందుకు అంటే ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ దేశంలో కరోనా మరియు ఓమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ఆల్రెడీ కొన్ని కీలక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు స్టార్ట్ చేసేసారు.

ఇది హిందీ మార్కెట్ లో పెద్ద ఎత్తున ప్రభావం చూపనుంది. అందుకే మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి తెలుగుతో పాటు హిందీ మార్కెట్ కూడా అంతే ముఖ్యం ఇప్పుడు అక్కడే మళ్ళీ దెబ్బ పడేలా ఉంది. ఇదిలా ఉండగా ఇవే ఆంక్షలు సౌత్ ఇండియన్ సినిమా దగ్గర కూడా రావచ్చని తెలుస్తుంది. మరి ఇదే కానీ నిజం అయితే మళ్ళీ ఈ భారీ సినిమా వాయిదా పడడం కన్ఫర్మ్.