Breaker For Rashmika : రష్మికకి ‘స్పీడ్ బ్రేకర్’ గట్టిగానే పడిందా.

Breaker For Rashmika

Breaker For Rashmika : పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ, అనూహ్యంగా చిన్న సినిమాకి ‘సై’ అనడమేంటి.? అనే కోణంలో ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ సినిమాకి రష్మిక మండన్న ఒప్పుకోవడంతో చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేసిన విషయం విదితమే.

‘సినిమా అంటే సినిమానే.. అది పెద్దదా.? చిన్నదా.? అన్న పట్టింపులు నాకు లేవు..’ అని రష్మిక  (Breaker For Rashmika ) అప్పట్లో చెప్పింది. పైగా, శర్వానంద్ లాంటి మంచి నటుడితో కలిసి పని చేయడం చాలా గొప్ప విషయమనీ చెప్పుకొచ్చింది.

నిజమే, నటీనటులు అలాగే వుండాలి. పెద్ద సినిమాలేంటి.? చిన్న సినిమాలేంటి.? పాత్రల్లో ఒదిగిపోవడం ముఖ్యం నటీనటులకి. ఇంతకీ, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ సినిమా తర్వాత రష్మిక పరిస్థితేంటి.? ఛత్.. అస్సలు ఈ సినిమా రిజల్ట్ఆ

మె మీద చూపే నెగెటివ్ ఇంపాక్ట్ ఏమీ లేదన్నది రష్మిక అభిమానుల వాదన. అందులో నిజం లేకపోలేదు కూడా. బ్యాక్ టు బ్యాక్ పెద్ద పెద్ద హిట్లు కొట్టిన రష్మికకి నిజంగానే చిన్నపాటి షాక్ అయితే ఇచ్చింది ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ సినిమా. అయితేనేం, ఆమె చేతిలో పెద్ద సినిమాలు చాలానే వున్నాయ్.. అందులో ‘పుష్ప ది రూల్’ ఒకటి. బాలీవుడ్ సినిమాలు, తమిళ సినిమాలు.. వెరసి, రష్మిక చాలా చాలా బిజీ.